సీఎం రేవంత్ ను కలిసిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి 

7

తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసం లో 'కుటుంబ సభ్యులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి  మత్స్య కార చేపను గుర్తుగా అందించారు. అనంతరం మెట్టు సాయికుమార్  మాట్లాడుతూ..ఎంతో నమ్మకంతో తనను రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి  'బలహీన వర్గాలు, మత్స్యకార పక్షపాతిగా చరిత్రలో మిగిలి పోతారని కొనియాడారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి  నాయకులను చేశారని చెప్పారు.

Read More నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం