రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు

రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు

 

పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమకు అడ్వాంటేజ్ గా ఉంటుందని వారు భావిస్తున్నారు. 

ఇందులో భాగంగా సినిమా నిర్మాతలు సోమవారం రోజున పవన్ కల్యాణ్‌ ను కలవబోతున్నారు. ఇందులో వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీ దత్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు (సూర్యదేవర నాగవంశీ), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సూర్యదేవర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఆ సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, బడా ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు. 

వీరంతా కూడా పవన్ ను కలిసి మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్లను చాలా వరకు తగ్గించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మళ్లీ టికెట్ రేట్లను పెంచమని వారు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ వాటిపై సానుకూలంగా స్పందిస్తాడని వారు భావిస్తున్నారు. 

Related Posts