కాళేశ్వరం లో భక్తుల పుణ్య స్థానాలు.

WhatsApp Image 2024-07-17 at 11.51.15_0687bc35

 విశ్వంభర భూపాలపల్లి జూలై 17 : -  భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. త్రివేణి సంఘంలో స్నానమాచరించిన భక్తులు ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. ఆషాడ మాస శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా, పెద్ద ఏకాదశి పండుగగా పిలుస్తారు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు శయన నిద్రలో ఉంటారని ఈ నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్షను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటి కీ భక్తులు నదికి విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 25.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.