తెలుగు కేంద్రమంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..!
1.jpeg)
ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో ఎక్కువగానే పదవులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఇవి ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ సారి ఎన్డీయే ప్రభుత్వంలో ఇద్దిరికే కేంద్ర కేబినెట్ పదవులు దక్కాయి. మిగతా ముగ్గురికి మాత్రం సహాయ మంత్రి పదవులు దక్కాయి.
ఈ రోజు మోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. అటు ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. వీరిద్దరికి మాత్రమే కేంద్ర కేబినెట్ హోదా దక్కింది.
ఇక బండి సంజయ్ ను హోంశాఖ సహాయమంత్రిగా నియమించారు. అటు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి పదవి వరించింది. ఇక ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి పదవి దక్కింది.