మృతుడి కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసిన మత్స్యగిరి గుట్ట దేవస్థానం మాజీ చైర్మన్
On

విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా : వలిగొండ మండలం, మొగిలిపాక గ్రామానికి చెందిన మచ్చ మైసయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని, మొగిలిపాక అభివృద్ధి ప్రదాత, శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో వైస్-చైర్మన్ జడిగె బిక్షపతి, మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ ఉపసర్పంచ్ విష్ణు, మాజీ పాలసంఘం చైర్మన్ సురేందర్, ముద్దసాని శేఖర్ రెడ్డి, ముత్యాలు, దుర్గయ్య, చంద్రయ్య, మచ్చ నవీన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.