శివ పార్వతుల కళ్యాణోత్సవంలో ఐలాపూర్ బిఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్

విశ్వంభర, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ శివాలయాల్లో శివకల్యాణం ఎంతోవైభవంగానిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ బిఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్ పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. భక్తుల విశ్వాసానికి, భగవంతుడి కృపకు ప్రతీకగా శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు. ఈ శివకల్యాణం సందర్భంగా వేదపండితులమంత్రోచ్చారణలతో అగ్నిహోత్రాలు, అభిషేకాలు, పుష్పార్చనలు జరిగాయి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అందరినీ భక్తిశ్రద్ధల్లో ముంచెత్తింది. భక్తులకు అన్నదానం, ప్రసాద విభజన వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. భజన మండళ్ల గానం, నృత్య ప్రదర్శనలు భక్తుల హృదయాలను దోచుకున్నాయి.ఈ మహోత్సవం ఘనంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలోపాలుపంచుకున్న మాణిక్ యాదవ్ కి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.