రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు
ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆయనను సస్పెండ్ చేసింది.
ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉత్తర్వులు జారీ చేసింది. బజరంగ్ పూనియా గతంలోనూ పలుమార్లు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.
మార్చి 10 న, ఎన్‌ఏడీఏ బజరంగ్ నుంచి నమూనాను డిమాండ్ చేసింది. అయితే బజరంగ్ యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తరువాత ఒక అథ్లెట్ నమూనా ఇవ్వలేదని ఎన్‌ఏడీఏ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీకి తెలిపింది. ఆ తర్వాత వాడా, నాడా మధ్య చాలా చర్చలు జరిగాయి. డబ్ల్యూడీఏ నోటీసు జారీ చేయాలని ఎన్‌ఏడీఏ కోరింది. బజరంగ్ పరీక్షకు ఎందుకు నిరాకరించాడో సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేశారు. అయితే, బజరంగ్ డోపింగ్ ఇవ్వడానికి నిరాకరించలేదని తెలిపాడు.
ఇదిలా ఉండగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రెజ్లర్‌లలో బజరంగ్ పూనియా కూడా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని అప్పట్లో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ పొగట్ తదితరులు ఆందోళనకు దిగారు.