అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
On

విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున
కాళేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్ళరాదని, అదేవిధంగా ప్రజలు గోదావరి తీర ప్రాంతంలోకి స్నానాలకు గాని ఇతర పనులకు గాని వెళ్ళరాదని, పశువులను ఆరుబయట మేతకు వదలొద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9030632608 కంట్రోల్ రూము 18004251123 నంబర్లు కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.



