సాంస్కృతిక కార్యక్రమాలకు గట్టిప్పలపల్లి విద్యార్థులు
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 16 :- తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పూజ, నందిని, వాణి, రాష్ట్రస్థాయి సంస్కృతిక పోటీలకు ఎంపికైన సందర్భంగా 20వ తేదీన యాదగిరిగుట్టలో ప్రదర్శన చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేణు రెడ్డి విద్యార్థుల తో పాటుగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసిన డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ కు సన్మానం చేసి వారికి 10000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రేణు రెడ్డి మాట్లాడుతూ గట్టు ఇప్పలపల్లి నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న సంస్కృతిక కార్యక్రమాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరంగా ఉంది అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు ఎంపిక కావడం మా గ్రామానికి ఎంతో అదృష్టం అని అన్నారు. ప్రతిభ చూపుతున్న గవర్నమెంట్ పాఠశాలలో చదివిన చిన్నారులకు మా వంతు సాయం ఎప్పటికీ ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి. శెట్టి రాజశేఖర్. కిషన్, వాల్మీకి, దేశముని రాములు.నరేందర్.గౌడ్ శివ గౌడ్. జక్కుల మల్లేష్. మచ్చేందర్ .రాహుల్ .పవన్ వాల్మీకి. శివశంకర్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు.