పార్లమెంట్ లో పరిమళించిన చేనేత వస్త్రాలు
పార్లమెంట్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా బైరెడ్డి శబరి ఉండాలంటూ చేనేత నాయకులు ఏలే మహేష్ నేత విజ్ఞప్తి
చేనేత వస్త్రాలు ధరించి లోక సభ లో అడుగు పెట్టిన తెలుగు ఎంపీ బైరెడ్డి శబరి ..
చేనేత వస్త్రాలను ధరించి పార్లమెంట్ లో ప్రసంగిస్తూన్నా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ధన్యావాదాలు
పార్లమెంట్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా బైరెడ్డి శబరి ఉండాలంటూ చేనేత నాయకులు ఏలే మహేష్ నేత విజ్ఞప్తి
చేనేత రంగాన్ని కాపాడే బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లపై ఉంది
రాజకీయ,సినీతారలు,దేవాలయ సిబ్బంది చేనేత వస్త్రాలను ధరించి ప్రమోట్ చేయాలి
ఈ దేశానికి రైతు ఎంత అవసమో .. చే "నేతన్న" కూడా అంతే అవసరం
హెదరాబాద్ ,విశ్వంభర :-పార్లమెంట్ లో 18 వ లోక్ సభ రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాద తీర్మానం పై చర్చ జరుగుతుంది . ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబందించిన ఎంపీలు వారి సాంప్రదాయ పద్ధతులకు తగ్గట్టు వస్త్రధారణలో పార్లమెంట్ కి రావడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నంద్యాల ఎంపీ గా తొలిసారిగా పార్లమెంట్ కు ఎన్నికైన బైరెడ్డి శబరి చేనేత వస్త్రాలను ధరించి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది.సమావేశాల సందర్బంగా ఢిల్లీ లో ఉన్న ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన సందర్భంలో కూడా చేనేత వస్త్రాలు ధరించి మర్యాదపూర్వకంగా వారిని కలిశారు. ఇదే విషయం పై పద్మశాలి పరిరక్షణ సమితి , చేనేత నాయకులు ఏలే మహేష్ నేత స్పందిస్తూ చేనేత వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమౌతున్న తరుణంలో పార్లమెంట్ సమావేశాల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేనేత వస్త్రాలు ధరించి ప్రసంగించారు.వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఎంపికైన లోక్ సభ ఎంపీలు , రాజ్యసభ సభ్యులు తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ లలో చేనేత వస్త్రాలు ధరించి సమావేశాలు జరిపితే చేనేత కార్మికులకు ఉపాధితో పాటు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ,ఎంపీలు చేనేత వ్యవస్థను ప్రమోట్ చేసి బలోపేతం అవ్వడానికి పరిస్థితులు ఉంటాయని అన్నారు. తద్వారా చేనేత రంగం అభివృద్ధి చెందుతుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి.అందుకే త్వరితగతిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు చర్యలు చేపట్టగలరని కోరుచున్నాము . తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు బీజేపీ ,కాంగ్రెస్ ., బిఆర్ ఎస్ , జనసేన ,టీడీపీ,సిపిఐ,సిపిఐ (ఎం),బి ఎస్ పి , టి జె ఎస్ , పలు పార్టీల అధ్యక్షులు ఆయా సభ్యులకు చేనేత వస్త్రాలు ధరించాలని సూచన చేయాలనీ అన్ని పార్టీలను కోరుతున్నాము. రాజకీయ , సినీతారలు , దేవాలయ సిబ్బంది చేనేత వస్త్రాలను ధరించి ప్రమోట్ చేయాలి.ప్రభుత్వ అధికార ,అనధికార కార్యక్రమాలకు కూడా ప్రతిఒక్కరు,ఉద్యోగులు , టీచర్లు , చేనేత వస్త్రాలు ధరించేలా చూడగలరు
జై రైతన్న .. జై చేనేత
చేనేత వస్త్రాలను ధరించండి... చేనేతకు చేయూతనివ్వండి
స్థానిక చేనేత కార్మికులకు ఆర్ధిక ఉపాధి కల్పించి వారి వస్త్రాలను నేరుగా చేనేత వస్త్రాలు కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని పొందవచ్చు PLACE OF SALES - TEXTILE ( https://placeofsales.com/ )