విత్రీ న్యూస్ , విశ్వంభర దిన పత్రిక జర్నలిస్ట్ కు అత్యున్నత పురస్కారం - ఉత్తమ ఎడిటోరియల్ జర్నలిస్ట్ గా  కడారి శ్రీనివాస్. 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేతుల మీదుగా సత్కారం 

విత్రీ న్యూస్ , విశ్వంభర దిన పత్రిక జర్నలిస్ట్ కు అత్యున్నత పురస్కారం - ఉత్తమ ఎడిటోరియల్ జర్నలిస్ట్ గా  కడారి శ్రీనివాస్. 

  • తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు  

విశ్వంభర, విజయవాడ : - తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు  ఆధ్వర్యంలో దాదాపు ఇరు రాష్ట్రాల నుంచి 100 మందిని ఎంపిక చేసుకొని వారికి నగదు పారితోషకంతో పాటు 25 లక్షల ప్రమాద బీమాను కూడా కల్పించింది తెలుగు జర్నలిస్టుల సంఘం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కడారి శ్రీనివాస్  విత్రీ న్యూస్ ఛానల్ లో పనిచేస్తూ అలాగే విశ్వంభర పేపర్లో ఎడిటోరియల్ రాస్తూ పనిచేస్తున్న సందర్భంగా వారిని తెలుగు జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు రంగనాయకులు ఎంపిక చేసి వారికి రాష్ట్ర ఉత్తమ ఎడిటోరియల్ జర్నలిస్టుగా అవార్డు ప్రధాన ఉత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన భారత సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్ వి రమణ చేతులమీదుగా ఈ అవార్డును కడారి శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ  చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవార్డు ద్వారా మరింత బాధ్యతను నాపై పెంచిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు...

Tags: