అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
విశ్వంభర, కేశంపేట ; సోమవారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం స్వామివారి ప్రేమను, వైభవాన్ని, ధర్మాన్ని, ప్రతిబింబించే దైవిక కార్యక్రమమని అభిప్రాయపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవిలా కళ్యాణ మహోత్సవం వైకుంఠంలో జరిగిన దివ్య వివాహాన్ని స్మరించుకుంటూ భూలోకంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని భక్తులు జరుపుకుంటారని తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడంతోపాటు భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని, యువతి యువకులకు వివాహా గడియలు వస్తాయనే నానుడి ఉందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను పొందారు. గత రెండు రోజులుగా దేవాలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల విందుగా కొనసాగుతున్నాయని, గ్రామంలో సంపూర్ణ దైవిక వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఉత్సవాలలో షాద్ నగర్ నియోజకవర్గంలోని పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



