భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం -తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్
విశ్వంభర, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జ్ఞాని,భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ నూటముప్పై నాల్గొవ జయంతి సంధర్బంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్ లోని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్. అధ్యక్షతన ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య. మాట్లాడుతూ రాజ్యాంగం నేడు దేశంలో మతతత్వ పార్టీ అయిన బిజెపి పాలనలో కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని, రాజ్యాంగం ను మార్చే కుట్ర జరుగుతోందని, అలాగే రాజ్యాంగం రాసిన డా.బి.ఆర్ అంబెడ్కర్ నిండు లోకసభలో దేశ హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని వారు గుర్తు చేశారు. ఆర్.ఎస్.ఎస్. భజరంగ్ దళ్ తో కలిసి బిజెపి పార్టీ లౌకికవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని మార్చి పంచ వర్ణ వ్యవస్థను కలిగిన మనుధర్మ శాస్తన్ని భారత దేశానికి రాజ్యాంగంగా తెచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.



