అంబేద్కర్ స్ఫూర్తిగా రాజ్యాధికారాన్ని సాధిద్దాం
విశ్వంభర, హనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక పరివర్తకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దామని మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మందకుమార్ మాదిగ పూలుపునిచ్చారు.సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన 134వ జయంతి వేడుకలలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘమైన పోరాటం జరిగిందని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ఎస్సీ వర్గీకరణ చేసిందని,ప్రభుత్వంతో పాటు సహకరించిన వివిధ రాజకీయ పక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఎస్సీ వర్గీకరణతోపాటు సమాజంలోని అనేక సమస్యలపై మందకృష్ణ మాదిగ అంబేద్కర్ మార్గంలో పోరాటం చేశారని ఆయన పోరాట ఫలితంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు పేదవారికి ఆరు కిలోల బియ్యం,వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని గుర్తు చేశారు.ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న బహుజన రాజ్యాధికారం సామాజిక పరివర్తకులు కృష్ణ మాదిగతోనే సాధ్యమవుతుందని అందుకు మాల సోదరులతో పాటు దళితులు,బీసీలు కలిసి రావాలని మంద కుమార్ మాదిగ కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మాదాసి సురేష్,చుంచు రాజేందర్,పుట్ట రవి మాదిగ,గద్దల సుకుమార్, పొన్నాల సురేందర్,మంద సంపత్,మంద మల్లేశం, సింగారపు రవి ప్రసాద్,మంద వీరస్వామి, అంకేశ్వరపు రామచంద్రరావు, గాండ్ల స్రవంతి,మేకల అనిత, బొర్ర సంపూర్ణ,కూనమల్ల అనిత తదితరులు పాల్గోన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



