అగ్నిమాపక వారోత్సవాలు గోడపత్రిక ఆవిష్కరణ -ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.

అగ్నిమాపక వారోత్సవాలు గోడపత్రిక ఆవిష్కరణ -ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.

విశ్వంభర, పరిగి :  అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా సోమవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. అందుకు సంబంధించిన గోడ పత్రిక ను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అగ్నిమాపక కేంద్రం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నేవ్య నాయక్, ఎల్ ఎఫ్ చంద్రమోహన్, డిఓపిలు మొగులయ్య, కృష్ణారెడ్డి, ఎఫ్ఎం పాండురంగం, ఆంజనేయులు, రఘురాంరెడ్డి, వెంకటేశం, నిరంజన్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: