యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్

 యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్

విశ్వంభర, హైదరాబాదు : యువతను ప్రోత్సహించడానికి వారిలో టాలెంట్ , నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి వీర లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్, గౌరవ అధ్యక్షులు ఎం.ఈశ్వరప్పలో ఈ కార్యక్రమానికి సంబంధించిన టోర్నమెంట్ రూల్స్ పుస్తకాన్ని, టోర్నమెంట్ కప్పు ను ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వీర లింగాయత్ యువతను ప్రోత్సహించే భాగంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుందని,ఈనెల 23నుంచి మే 1 వరకు గవర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్లో 34 టీంలు కప్పు కోసం పోటీ పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. కోశాధికారి రాజప్ప, ఆర్గనైజ్మెంట్ చైర్మన్ రాజశేఖర్, అజయ్ కుమార్ , ప్రవీణ్ కుమార్ , శివచరణ్, తదితరులు పాల్గొన్నారు

Tags: