ఐకేపి సెంటర్ లో బెస్ట్ సేవా సొసైటి వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు..

ఐకేపి సెంటర్ లో బెస్ట్ సేవా సొసైటి వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు..

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో బెస్ట్  సేవా సొసైటి వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య 69వ జన్మదిన వేడుకలను కక్కిరేణిలోని ఐకేపి, అంబేడ్కర్ సెంటర్ లో కార్మికులు, కర్షకులు, యువకుల మద్య ఆనందోత్సవంతో ఘనంగా జరుపుకొని స్వీట్లు పంపిణీ చెయ్యడం జరిగింది. సమాజ సేవకులైన బుక్కా ఈశ్వరయ్య కక్కిరేణి గ్రామంలో అనేక సామాజిక అంశాలపై పాఠశాల, వృద్దులకు, విద్యార్దులకు, అంగవైకల్యులకు, యువతకు అందిస్తున్న సహయ సహకారాలు మరువలేనివని మాతృభూమిపై గల  మమకారంతో అందిస్తున్న సహయ సహకారాలకు మేము రుణపడి ఉంటామని వారు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, భగవంతున్ని కోరుకుంటున్నామని, ఇలాగే గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిట్ట కృష్ణారెడ్డి, సోమేశ్వర రావు, నల్ల యాదయ్య, బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు, కన్నేబోయిన యాదయ్య, బుర్ర నాగేష్, దుకేందర్, ప్రసాద్, నరసింహ, మాధురి, యాదమ్మ, అనిత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: