గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం విద్యార్థి మృతి 

2

26 జులై 2024 మెట్పల్లి :- మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఘనవిద్య అనే విద్యార్థికి రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో పిక్స్ వచ్చి కాళ్లు చేతులు వంకరపోవడంతో నైట్ డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుడు ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కు రిపోర్ట్ ఇచ్చిన ఉపాధ్యాయునితో తల్లిదండ్రులకు కబురు చేయమని ఉపాధ్యాయునికి ఆర్డర్ ఇచ్చారు విద్యార్థికి సీరియస్ ఉన్నది అని చెప్పిన  తన క్వార్టర్ నుండి బయటకు రాలేదు ప్రిన్సిపల్ విద్యార్థి సుమారు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించారని తోటి విద్యార్థులు అన్నారు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలిగొన్న ప్రిన్సిపల్ సీరియస్ సమయంలో సొంతంగా హాస్పిటల్కు తీసుకువెళ్లిన లేదా 108 కు సమాచారం అందించిన విద్యార్థి బతికే అవకాశాలు ఉండేవి అని తల్లిదండ్రుల ఆరోపణ  హాస్టల్ ఇంచార్జ్ నైట్ డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులకు సమాచారం తెలుపగా ఆరెపేట కాలానికి చెందిన తండ్రి రాజారపు మహేష్  హుటాహుటిన బయలుదేరి బండిపై ఆసుపత్రికి తరలించే లోపు విద్యార్థి చనిపోయాడు అని డాక్టర్లు తెలిపారు కాగా విధి నిర్వహణలో ఉన్న గురుకుల పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులకు అప్పగించడం బాబును అప్పగించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గతంలో కూడా పలువురు విద్యార్థు లకు పాములు తేళ్లు కాటు వేసినా విద్యార్థుల కు ఎలాంటి రక్షణ కల్పించలేదు అని ఆరోపణలు ఉన్నాయి ఈ సంఘటనతో పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు విద్యార్థి మృతి పట్ల విచారణ జరిపి మృతికి కారకులైన నిర్లక్ష్యం వహించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని విద్యార్థి తల్లిదండ్రు లు రాజారపు మహేష్ లావణ్య దంపతులకు ఏకైక కుమారుడు రాజారపు ఘనవిద్య కు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

Read More ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తీస్తున్న JCB పై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు