తమిళనాడులో కల్తీసారా ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
On
- తమిళనాడులో కల్తీసారా కలకలం
- ఈ ఘటనలో ఇప్పటివరకు 40కి చేరిన మృతుల సంఖ్య
- వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న 109 మంది
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 109 మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
విళుపరం, తిరుచ్చి, సేలం, తిరువణ్ణామలై తదితర జిల్లా పరిధిలో వైద్యకళాశాలల్లోని వైద్యుల్ని తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కుటుంబ పెద్దలు కల్తీసారా తాగి మృతిచెందడంతో పలు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ పలువురు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శాంతి భద్రతలు అదుపుతప్పకుండా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.



