కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

  • చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
  • అల్వాల్‌లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రూపాదేవి
  • ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ 

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 

అయితే, సత్యం భార్య వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండు రోజులుగా ఆమె పాఠశాలకు వెళ్లలేదు. ఇంటికి వచ్చిన రూపాదేవి అల్వాల్‌లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు