కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే

కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

విరాట్ కోహ్లీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో సచిన్ టెండూట్కర్ రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని వారసుడిగా గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ. సచిన్ కంటే వేగంగా సెంచరీలు చేస్తూ సచిన్ కు తగ్గ క్రికెటర్ అనిపించుకున్నాడు. అలాంటి విరాట్.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. 

నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా అదరగొట్టి టీ20 వరల్డ్ కప్ ను ఎత్తుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పడు విరాట్ స్థానాన్ని భర్తీ చేసేది మాత్రం శుభ్ మన్ గిల్ అని అంటున్నారు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్ లో గిల్ 14 మ్యాచ్‌లలో 25.76 సగటుతో 335 పరుగులు చేశాడు. 

ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. 3వ నంబర్‌లో ఆడుతున్నప్పుడు గిల్ రికార్డు కూడా చాలా బాగుంది. ఓపెనింగ్ కూడా చేయగలడు. కాబట్టి అతను భవిష్యత్ లో మరింత ఎక్కువగా పరుగులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిలకడగా ఆడటంలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంటున్నారు.  

Related Posts