రాత్రి పూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. గుండెపోటు రావచ్చు..!

రాత్రి పూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. గుండెపోటు రావచ్చు..!

 

ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా ఇవి కనిపిస్తున్నాయి. దాంతో గుండె సంబంధిత సమస్యలు ఎవరికి వచ్చినా సరే వెంటనే అలెర్ట్ అవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు.

ఇందులో చూసుకుంటే రాత్రి సమయంలో కడుపు, భుజాలు, వీపు, దవడ, మెడ లేదా గొంతులో నొప్పి ఉంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటు ఎసిడిటీ తరచూ రాత్రి వస్తుందంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. 

చాలా మందికి నిద్ర పోతున్న సమయంలో ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. అది కూడా గుండెపోటుకు కారణం కావచ్చు. కాబట్టి రెగ్యులర్ గా నిద్ర పోతున్నప్పుడు చెమటలు వస్తుంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.

గుండె జబ్బులు వస్తే ఆ సమయంలో గుండె ఎక్కువగా కష్టపడుతుంది. దాంతో మనం తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఏ పని చేయకున్న అలసటగా అనిపిస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

మీకు తరచూ మలబద్దకం లేదా విరేచనాలు అవుతుంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్త వహించాలి. అందులోనూ 60 ఏళ్లు పైబడిన వారైతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే బెటర్.

Related Posts