పదవులు శాశ్వతం కాదు..  ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం

పదవులు శాశ్వతం కాదు..  ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం

  • ఓటమిపై జగన్ భావోద్వేగం
  • ఐదేళ్లు తప్ప మొత్తం ప్రతిపక్షంలో ఉన్నా
  • ఐదేండ్లుగా పేదవాళ్లకు అండగా ఉన్నాం
  • ఏం జరిగిందో అర్థం కావట్లేదు
  • ఏ ప్రభుత్వం చేయని పనులు చేశాం
  • మేనిఫెస్టో హామీలు 99 శాతం పూర్తి 
  • కన్నీళ్లు ఆపుకుంటూ మాట్లాడిన సీఎం
  • ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

విశ్వంభరం, తాడేపల్లి: ఏపీ సార్వత్రిక ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఫలితాలపై మంగళవారం ఆయన తాడేపల్లి కార్యాలయంలో మీడియాలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో తాపత్రయపడ్డామని వెల్లడించారు. ఎంతో చేయాలని అనుకున్నామని చెప్పారు. ఎంత మంచి పని చేసిన కూడా ఏమెందో తెలియడం లేదన్నారు. ప్రజల కష్టాలే తన కష్టాలుగా బావించానని పేర్కొన్నారు. హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో ఎప్పుడూ జరగని పని చేశామన్నారు. అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదని భావోగ్వేగానికి గురయ్యారు. అక్కా చెల్లెళ్ల అప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. అరకోటి రైతుల ప్రేమ ఏమైందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. అక్కా చెల్లెళ్ల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని వెల్లడించారు. అమ్మఒడితో కోటి 53 లక్షల మందికి మంచి చేశామన్నారు. ఆటోలు నడుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనమిత్ర పథకం తీసుకువచ్చామన్నారు. కోట్ల మందికి మంచి చేసిన వారి ప్రేమ దక్కలేదన్నారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సంతోషంగా తీసుకుంటాం అంటూ తెలిపారు. అన్ని రంగాల్లో మార్పు తీసుకువచ్చి పేదవాడికి అండగా ఉన్నామని, తాము అధికారంలోకి వచ్చన తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ఆ దేవునికి తెలుసని ఓటమిపై ఉద్వేగంతో మాట్లాడారు. సామాజిక న్యాయం అంటే ఇదని ప్రపంచానికి చూపించామన్నారు. 

ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటాం..

ప్రజల తీర్పు తీసుకుంటామని, కానీ, మంచి చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. పేదవాడికి అండగా ఉండే విషయంలో వారికి ఎప్పుడూ తోడుగా ఉంటామని, తమ గళం వినిపిస్తూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీని శాసించే వారి కూటమి ఇది.. ఈ కూటమిలో ఉన్న బీజేపీకి, టీడీపీకి, పవన్ కల్యాణ్‌కు, వారి గొప్ప విజయానికి అభినందనలు తెలియజేశారు. తన ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్‌కు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప, తన రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలో గడిపానని, రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను భరించానని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు అంతకన్నా ఏమన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా, భరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

సీఎం పదవికి రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి జగన్‌మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ ఫలితాల్లో కూటమి విజయ ఢంకా మోగించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటు గవర్నమెంట్‌లోకి వచ్చిన వారికి అభినందనలు తెలియజేశారు జగన్

Related Posts